- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదాయశాఖలో సీతతో కొత్త ఒరవడి: మంత్రి కొండా సురేఖ
దేవాదాయశాఖలో స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎస్ ఐ టీ ఏ - సీత )తో కొత్త ఒరవడి ప్రారంభమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: దేవాదాయశాఖలో స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎస్ ఐ టీ ఏ - సీత )తో కొత్త ఒరవడి ప్రారంభమైందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు బొగ్గులకుంట లోని కార్యాలయంలో రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి , ఆధునిక విధానాల నిర్వహణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్య కార్యదర్శి శైలెజా రామయ్యర్ మాట్లాడుతూ సీత ఏర్పాటుతో ఆలయాల నిర్వహణ సక్రమంగా జరుగుతుందన్నారు. కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ, మూడు రోజులలలో సంస్కృతి, ఆగమ శాస్త్రాలపై ధార్మిక భవన్ తో పాటు భద్రాచలం, వేములవాడ, యాదగిరి గుట్లలలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు...
అనంతరం పలువురు ఉద్యోగులకు పదోన్నతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవిందహరి, సీత డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, ఏసీలు శ్రీనివాసరావు, కుర్రాకుల జ్యోతి, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీలు వినోద్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్య ప్రసాద్, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు నారాయణ స్వామి చిలకమర్రి శ్రవణ్ కుమార్ చారి బండారి జగపతి గ్రేటర్ అధ్యక్షులు రమేష్ సురేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ అర్చక ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కాండూరి కష్ణమాచారి స్వయంగా గీసిన మంత్రి కొండాసురేఖ, ముఖ్య కార్యదర్శి శైలెజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు చిత్రపటాలను వారికి బహురించారు. ఈ సందర్భంగా వారు ఆయనను ఘనంగా సన్మానించారు.






