ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

by Vemula.Srinu Prasad |

టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని షేక్‌పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు..

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం
X

దిశ, తిరుపతి ప్రతినిధి: టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని షేక్‌పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డిడిని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందించారు.

ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎన్. సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story