- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'సర్' పై బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన కలిగి ఉండాలి...
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై ఏజెంట్లకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర రాజనర్సింహ అన్నారు.

దిశ, ఆందోల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై ఏజెంట్లకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర రాజనర్సింహ అన్నారు. సర్ ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, ఈ విధానాలపై ఉన్న అపోహలను తొలగింపజేయలని ఆయన సూచించారు. ఆందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ , వట్పల్లి, పుల్కల్, చౌటకూరు మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్ ఏ)లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సవరణలు చేపట్టేందుకు కృషి చేయాలని, అర్హులైన ఓటరు ఓటర్ల జాబితా నుండి తొలగింపు లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ సమావేశంలో ఆందో ల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సురేందర్ గౌడ్, శివరాజ్, కౌన్సిలర్ లు పి. శ్రీనివాస్, అరుణ్ కుమార్, మాజీ చైర్మన్ మల్లయ్య, మాజీ కౌన్సిలర్ లు నాని నాగరాజ్, లక్ష్మణ్, నాయకులు శంకర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, అనిల్, శైలాన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.






