- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊట్కూరు వాసి రంగు ముత్యంరాజు డాక్టరేట్ పురస్కారంకు ఎంపిక..
రంగు ముత్యంరాజు గురుస్వామి ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక అకాడమీ యాజమాన్యం ద్వారా గౌరవ డాక్టరెట్‌కు ఎంపికయ్యారు.

దిశ, శాలిగౌరారం: మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు, ఉద్యాన విస్తరణ అధికారి, రంగు ముత్యంరాజు గురుస్వామి ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక అకాడమీ (ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం) యాజమాన్యం ద్వారా గౌరవ డాక్టరెట్‌కు ఎంపికయ్యారు. ఉద్యానవనం, దైవత్వం, ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ డాక్టరెట్‌ను ఈ నెల 27 తమిళనాడు రాష్ట్రం హోసూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. రంగు ముత్యం రాజు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో రైతు కుటుంబంనకు చెందిన రంగు సత్తయ్య గౌడ్ బుచ్చమ్మ దంపతులకు మొదటి సంతానంగా 1977 మే 9 న జన్మించారు. అతను చిన్న తనం నుండే, ఆధ్యాత్మిక, సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తక్కువ వేతనం ఉన్నప్పటికీ...
1994 సంవత్సరంలోనే నవోదయ యువజన సంఘం స్థాపించి మిత్రులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారత జాతీయ విద్యార్థి సంఘంలో పనిచేశారు. గత 25 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొంటూ, గురుస్వామిగా పూజలు చేస్తూ, ఎంతో మంది స్వాములకు అయ్యప్ప తత్త్వం అలవరుస్తూ భక్తుల్లో దైవత్వం, సేవా భావం కలిగేలా కృషి చేస్తున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో పనిచేస్తూ దాతల సహకారంతో పేదలకు అన్నదానం, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. రైతులకు సేవా చేయాలనే దృక్పధంతో తక్కువ వేతనం ఉన్నప్పటికీ గత 16 సంవత్సరాల నుండి ఉద్యాన శాఖలో పని చేస్తూ రైతులకు సేవలు అందిస్తున్నారు. జర్నలిజం పైన మక్కువతో తాను 1997 నుండి పత్రిక రంగంలో ఉంటూ జర్నలిస్ట్‌గా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. తనను గౌరవ డాక్టరేట్ పురస్కారంనకు ఎంపిక చేసిన ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక అకాడమీ (ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం) యాజమాన్యం కు కృతజ్ఞతలు తెలిపారు.






