- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరూ ముందుకురండి: ఎమ్మెల్యే పరిటాల సునీత
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు....

దిశ, ధర్మవరం (అనంతపురం): ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో ఆమె యోగాసనాల సాధన చేశారు. సూర్యోదయాన ఆసనాలు వేస్తూ ప్రశాంత వాతావరణంలో గడిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ మనిషి ప్రతి రోజు హుషారుగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. యోగాను తప్పనిసరి అలవాటుగా చేసుకోవాలన్నారు. రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తే.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే ఉండదన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన దేశానికి వారసత్వ సంపదగా వచ్చిన యోగాను ప్రోత్సహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్తున్నారన్నారు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని.. ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే సునీత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే సునీత కలిశారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపారు.






