నిజాలతో యుద్ధం ప్రారంభమవుతుంది.. కొత్త సినిమా పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన విజయ్ ఆంటోని

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-19 15:47:18  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

నిజాలతో యుద్ధం ప్రారంభమవుతుంది.. కొత్త సినిమా పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన విజయ్ ఆంటోని
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. విభిన్న కథలు ఎంచుకుంటున్న ఆయన తన అభిమానులకు వరుస ట్రీట్ ఇస్తున్నారు. ప్రస్తుతం పరాశక్తి, మార్గన్ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా, విజయ్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఆయన 26వ మూవీని జోషు సేతురామన్ దర్శకత్వంలో చేయనున్నట్లు వెల్లడించారు. దీనిని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమాకు ‘లాయర్’(Lawyer) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు విజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఫస్ట్ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ఇందులో న్యాయానికి పేరు ఉంది అని ఓ బుక్ పట్టుకుని ఉన్న పిక్‌ను జత చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘యుద్ధం ప్రారంభమవుతుంది—ముష్టితో కాదు, వాస్తవాలతో’’ అని క్యాప్షన్ జత చేశాడు. అయితే ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.

Next Story