- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Chaitanya: ఘనంగా చైతూ-శోభిత పెళ్లి.. బిందెలో ఉంగరం ఎవరు తీశారంటే..?
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో నాగచైతన్య(Naga Chaitanya).

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో నాగచైతన్య(Naga Chaitanya). సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్ని మెప్పించాడు. ప్రజెంట్ తండేల్(Tandel) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు చందు మొండేటి(Chandu mondeti) దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్(Geeta Arts Banner)పై అల్లు అరవింద్(Allu Arvind) ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Natural Beauty Sai Pallavi) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే..
నాగచైతన్య అండ్ శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipalla) ఈ ఏడాది (2024) డిసెంబరు 4 వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇరుకుంటుంబీకుల సమక్షంలో జరిగిన ఈ మ్యారేజ్‌కు పలువులు సినీ ప్రముఖులు హాజరై.. కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చైతూ-శోభితా పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య ఫ్యాన్స్ పెళ్లికి సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పెళ్లిలో పాలబిందెలో ఉంగరం వేసి పెళ్లి కొడుకు-పెళ్లి కూతురు.. ఆ రింగ్ తీసే ఓ ఘట్టం ఉంటుంది. కాగా వీరి పెళ్లితో ఆ ఉంగరాన్ని పోటీపడీ మరీ నాగచైతన్య తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






