బైకర్ ట్రైలర్ విడుదలకు వేదిక ఖరారైంది.

by Pulgam srinivas |   (  Updated:2026-03-21 12:12:53  IST  )

బైకర్’ ట్రైలర్‌ను మార్చ్ 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని PRASAD'S PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

బైకర్ ట్రైలర్ విడుదలకు వేదిక ఖరారైంది.
X

దిశ, వెబ్ డెస్క్: శర్వానంద్ తాజాగా ‘బైకర్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలకమైన పాత్రలో కనిపించబోతుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్ల స్పీడును మరింత పెంచింది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ మరియు వేదికను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘బైకర్’ ట్రైలర్‌ను మార్చ్ 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని PRASAD'S PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రకటనతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా అదే స్థాయిలో జనాలను అలరించినట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతకాలం క్రితమే శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరి ఆ విజయాల పరంపరను ‘బైకర్’ చిత్రంతో కూడా శర్వానంద్ కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.

కుటుంబంతో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన మెగాస్టార్




Next Story