- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పండుగకు రాబోతున్న స్టార్ కిడ్ ‘బైసన్’ మూవీ.. పోస్టర్‌తోనే హైప్ పెంచేశారుగా..
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ (DhruvVikram) హీరోగా మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘బైసన్’ (Bison).

దిశ, వెబ్‌డెస్క్: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ (DhruvVikram) హీరోగా మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘బైసన్’ (Bison). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran ) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి (Pasupathy), కలైయరసన్ (Kalaiyarasan), రెజిషా విజయన్ (Rajisha Vijayan), హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్ పతాకం, దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం స్టూడియో సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘బైసన్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ దిపావళి స్పెషల్‌గా థియేటర్లలో రాబోతుంది అని మేకర్స్ వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇక పోస్టర్‌లో గోడపై ఎద్దు కొమ్ముల్లాగా చెక్కతో చెక్కి ఉంది. పక్కనే అడుగుల్లాగా చెక్కి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






