- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న బుల్లితెర హీరోయిన్..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు
బుల్లితెరపై ‘మౌనరాగం’(Mounaragam) సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి ప్రియాంక జైన్(Priyanka Jain) అందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ‘మౌనరాగం’(Mounaragam) సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి ప్రియాంక జైన్(Priyanka Jain) అందరికీ సుపరిచితమే. ఇందులో మాటలు రాని అమ్మాయిగా కనిపిస్తూ సహజ నటనతో కట్టిపడేసింది. అలా ఈ సీరియల్‌తో తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’(Janaki Kalaganaledhu) సీరియల్‌లో మరింత ఫేమ్ తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) రియాల్టీ షోలోకి వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన గేమ్‌తో టాప్ 5లో ప్లేస్ సంపాదించుకున్నది. కానీ విన్నర్ కాలేకపోయింది. అయితే ఈ అమ్మడు బుల్లితెర యాక్టర్ శివ్ కుమార్(Shiv Kumar)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
అతనితో ఈ భామ నెట్టింట చేసే రచ్చ అంతా అంతా ఇంతా కాదు. అయితే వీరు లివింగ్ రిలేషన్స్ షిప్‌లో ఉన్నారు. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(Social Media)లో రొమాంటిక్ పోజులు&వీడియోలు చేసి వాటిని పోస్ట్ చేసి కొన్ని సార్లు తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి వీరి ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ జంట షేర్ చేసిన ఫొటోల్లో ముద్దుగుమ్మ ప్రియాంక ప్రెగ్నెంట్ ఉన్నట్లుగా కనిపించింది. దీంతో నెటిజన్లు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది దయచేసి పెళ్లి చేసుకోండి అప్పుడు చూసేవాళ్లకి మాకు చేసేవాళ్లకి మీకు బాగుంటుంది అని, పెళ్లి చేసుకుంటారో లేదో కానీ ఎంజాయ్ మాత్రం పీక్స్ లెవెల్ వరకు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.






