- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్చనీయాంశంగా మారిన బుల్లితెర నటి పోస్ట్.. మెడలో అది వేసుకుని కనిపించడంతో నెటిజన్లు షాక్
బుల్లితెర నటి రీతూ చౌదరి(Rithu Chaudhary) గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: బుల్లితెర నటి రీతూ చౌదరి(Rithu Chaudhary) గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. హైపర్ ఆది టీమ్‌లో స్కిట్లలో కనిపించడంతో రీతూకి భారీ పాపులారిటీ పెరిగిపోయింది. ఆ తర్వాత యాంకర్‌గా పలు చిన్నా చితకా కార్యక్రమాలకు హోస్ట్ చేసిన ఆమె పలు సీరియల్స్‌లోనూ కనిపించింది. బుల్లితెరపై టీవీ షోలు, హోస్టింగ్, ప్రైవేట్ ఈవెంట్స్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో బిజీగా గడుపుతున్నారు రీతూ.
ఆమె పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. ప్రస్తుతం బుల్లితెరలోకొనసాగుతున్న ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల రీతూ చౌదరి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. గత ఏడాది ఏపీలో వెలుగుచూసిన రూ. 700 కోట్ల ల్యాంగ్ స్కాంలో ఆమె పేరు బయటకు రావడంతో సంచలనంగా మారింది. అయితే దీనికి కారణం ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటితో అంతా షాక్‌కు గురయ్యారు ఆమెకు పెళ్లి ఎప్పుడయిందని చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే.. ఆమె తనకు 2022లో జరిగిందని కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతున్నట్లు వెల్లడించింది. దీంతో ల్యాండ్ స్కాంకు చెక్ పడినట్లు అయింది.
ఇక రీతూ చౌదరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె హాట్ ఫొటోలతో కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక పోస్టుతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రీతూ చౌదరి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇందులో ఏముందంటే.. ఆకుపచ్చ, రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న చీరను కట్టుకుని అందాలుఆరబోసింది. ఇందులో ఆమె రుద్రాక్షను మెడలో వేసుకుని కనిపించింది. ఇక ఈ ఫొటోలు చూసిన వారు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు అసలు అది ఎందుకు వేసుకుందని పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నువ్వేనా ఇంత అందంగా ఉన్నావ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






