ఆ తేదీన ‘తిమ్మరాజు పల్లి’ ట్రైలర్ విడుదల

by Pulgam srinivas |

ఏప్రిల్ 9వ తేదీన తిమ్మరాజుపల్లి టీవీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

ఆ తేదీన ‘తిమ్మరాజు పల్లి’ ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తన సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో యువ నటినటులు సాయి తేజ్, వేద జలంధర్ హీరో, హీరోయిన్‌లుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఈ మూవీ బృందం ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని, అది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించారు. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.




Next Story