ఆ తేదీన విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ ట్రైలర్

by Pulgam srinivas |

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్‌ను మే 29న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ తేదీన విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ ట్రైలర్
X

దిశ, వెబ్ డెస్క్: సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాక్‌టెయిల్’ చిత్రం 2012లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు స్పిరిచువల్ సీక్వెల్‌గా ‘కాక్‌టెయిల్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 19న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్‌ను మే 29న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని బాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Next Story