- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయి ఆ పార్ట్ మీద చేతులేసి మరీ దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanandh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఐదో తారీఖు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanandh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఐదో తారీఖు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ సరైన హిట్ లేక సతమవుతున్నాడు. ప్రస్తుతం మంచి విజయం కోసం బాగా కష్ట పడుతున్నాడు. గత ఏడాది ‘మనమే’(Maname) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారీ’(Nari Nari Naduma Murari) ఒకటి. ఈ మూవీలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ సుంకర్(Anil Sunkar) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య మూవీ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. అలాగే అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీ టైటిల్ ‘జానీ’(Johnny) టైటిల్‌ను పెట్టబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతుంది. అయితే రెండు సినిమాలకు స్టార్ హీరోల టైటిల్స్ పెట్టనుండటంతో ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీ నెలకొంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శర్వానంద్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టాడు. అందులో ఒక ఫారెన్ అమ్మాయి షోల్డర్ పై చేయి వేసి చాలా క్లోజ్‌గా ఫొటో దిగాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు భార్యను ఉంచుకుని వేరే అమ్మాయి మీద ఇంత చనువుగా హ్యాండ్ వేయగలిగావు అంటే నీ గట్స్‌కి నమస్కారం అంటూ షాక్ అవుతున్న ఎమోజీలు పెడుతున్నారు.






