- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య- వివేక్ ఆత్రేయ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఎన్ని భాగాలుగా రానుందో తెలుసా?
బాలయ్య- వివేక్ ఆత్రేయ చిత్రానికి కురుక్షేత్రం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ–వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ సినిమా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ కొత్త మూవీ షూటింగ్‌ను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ సంవత్సరం దసరా తర్వాత ఈ క్రేజీ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కథ చాలా విస్తృతంగా ఉండడంతో, ఒకే భాగంలో చెప్పడం కష్టమనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలనే ఆలోచనకు ఆయన వచ్చినట్లు సమాచారం. ఈయన ప్రతిపాదనకి హీరో మరియు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు, మరికొన్ని రోజుల్లో దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ తన కెరీర్ ప్రారంభంలో క్లాస్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మాస్ దర్శకుడిగా కూడా గుర్తింపు సంపాదించాడు. ఇక ఇప్పుడు బాలయ్యతో సినిమా అంటే, ఈ దర్శకుడు మరోసారి మాస్ అంశాలతో ప్రేక్షకులను అలరించేలా బీభత్సం సృష్టిస్తాడని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






