పెద్ది’ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు

by Pulgam srinivas |

పెద్ది టీజర్‌ను మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

పెద్ది’ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా టీజర్ విడుదలపై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సినిమా టీజర్‌ను మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, టీజర్‌పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధు తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




Next Story