- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Siddu Jonnalagadda: స్టార్ బాయ్ ‘జాక్ కొంచెం క్రాక్’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డీజే టిల్లు’(DJ Tillu)చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డీజే టిల్లు’(DJ Tillu)చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో సిద్దు జొన్నలగడ్డ స్టార్ బాయ్‌గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత ‘డిజే టిల్లు’కు సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నారు. ప్రజెంట్ సిద్దు తెలుసు కదా, జాక్ కొంచెం క్రాక్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ‘జాక్’ సినిమా బొమ్మరిల్లు భాస్కర్(Bhaskar) దర్శకత్వంలో రాబోతుంది. అయితే ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ సరసన టాలీవుడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను ఎస్‌విసిసి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్(Sri Venkateswara Cinemas) బ్యానర్స్‌పై బాపినీడు, చిత్ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అయితే రిలీజ్ కాకుండానే ‘జాక్ కొంచెం క్రాక్’ ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘జాక్’ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 7న 11: 07 గంటలకు రాబోతున్నట్లు తెలిపారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ డార్క్ షేడ్‌తో ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన కోపంగా చూస్తూ చేతిని చాచగా ఆయన హ్యాండ్‌కు ఉన్న రింగ్‌ను హైలెట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
Catch #JackTeaser tomorrow at 11:07 AM 💥💥#Jack #JackOnApril10th #SidduJonnalagadda pic.twitter.com/I3Va8o5C2K
— BA Raju's Team (@baraju_SuperHit) February 6, 2025






