- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇన్నాళ్లు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో పూర్తిగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇన్నాళ్లు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో పూర్తిగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. ఇక గత కొద్ది రోజుల నుంచి సమయం దొరికినప్పుడల్లా మళ్లీ మూవీస్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్, జ్యోతి కృష్ణ(Jyoti Krishna) దర్శకత్వంలో రాబోతున్న ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు నిర్మిస్తున్నారు. దీనికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా.. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ‘హరిహర వీరమల్లు’ బిగ్ స్క్రీన్‌పైకి రాకముందే ఓ ముఖ్యమైన ఈవెంట్ జరగబోతున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ మే 21న ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానుల్లో ఈ ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పనున్నారనేది దానిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. కాగా, ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నింటినిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ రాజకీయాల వల్ల ఈ మూవీస్ వాయిదా పడుతూ వస్తున్నాయి.






