‘నందమూరి మోక్షజ్ఞ’ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్‌..!

by velandi.Saikiran |

నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 369 సీక్వల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ అని టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

‘నందమూరి మోక్షజ్ఞ’  ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ ఓ రేంజ్ కి వెళ్లారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలయ్య, కళ్యాణ్ రామ్ శకం నడుస్తోంది. త్వరలోనే నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఇప్పటికే ఈయన సినిమా ఎంట్రీ పైన చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో రూమర్ బయటకు వచ్చింది.

మోక్షజ్ఞ మొదటి సినిమా ఏంటంటే ?

నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 369 సీక్వల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ అని టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఈనెల చివరలో ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా అధికారికంగా జరగనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మార్చి మొదటి వారంలో షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట. బాలయ్య సెంటిమెంట్ ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Next Story