అమ్మాయి గెటప్ అనేసరికి ఆ ముగ్గురు హీరోలు ముందుకు రాలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

by Kavitha |
అమ్మాయి గెటప్ అనేసరికి ఆ ముగ్గురు హీరోలు ముందుకు రాలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో లైలా నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత సాహు గారపాటి(Sahu Garapati) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘లైలా సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం.. కథలోని వినోదం. నిజంగా ఓ హీరో ఇలాంటి పాత్రను స్వీకరించడం పెద్ద సవాలే. గతంలో ఓ ముగ్గురు హీరోలతో ఈ కథ విషయమై చర్చించా. అమ్మాయి గెటప్ అనేసరికి వాళ్లు చేయడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత విశ్వక్ పేరు దృష్టిలోకి వచ్చింది.

తను ఇలాంటి భిన్నమైన ప్రయోగాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే ఈ కథను తనకు చెప్పించగా.. వెంటనే చేస్తానని చెప్పారు. ప్రత్యేకంగా వీళ్ల కోసం అనేం లేదు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించడమే మా ధ్యేయం. చిరంజీవి(Chiranjeevi) ఈ మూవీ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకి విశ్వక్ పూర్తిగా న్యాయం చేశాడు. రెండు పాత్రల్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement
Next Story