‘భైరవం’ నుంచి థర్డ్ సింగిల్ డుం డుమారే అవుట్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోస్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-03 15:21:40  IST  )

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam).

‘భైరవం’ నుంచి థర్డ్ సింగిల్ డుం డుమారే అవుట్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్(KK Radhamohan) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నటి ప్రియమణి(Priyamani), జయసుధ(Jayasudha) కీలక పాత్రలో నటిస్తుండగా.. దివ్య పిళ్లై(divya Pillai), అదితి శంకర్(Aditi Shankar), ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ‘భైరవం’ సినిమా మే 30న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఇక ఇందులోంచి ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ చిత్రంపై అంచనాలను పెంచగా.. తాజాగా థర్డ్ సింగిల్ డుమ్ డుమారే సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ పాటలో ముగ్గురు హీరోలు హీరోయిన్స్‌తో డ్యాన్స్‌ ఇరగదీశారు. ప్రస్తుతం ఈ సాంగ్ లిరిక్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Next Story