Lovely Teaser: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘లవ్లీ’ టీజర్.. రాజమౌళి ఈగ అబ్బాయి .. ఇక్కడ అమ్మాయి.. కాన్సెప్ట్ అదిరింది..!

by Phanindra |   (  Updated:2025-07-28 15:34:26  IST  )

దిలీష్ కరుణాకరన్ దర్శకత్వంలో మ్యాథ్యు థామస్ హీరోగా " లవ్లీ " చిత్రం తెరకెక్కుతుంది

Lovely Teaser: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘లవ్లీ’ టీజర్.. రాజమౌళి ఈగ అబ్బాయి .. ఇక్కడ అమ్మాయి.. కాన్సెప్ట్ అదిరింది..!
X

దిశ, వెబ్ డెస్క్ : నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన " ఈగ " చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అప్పట్లో ఒక సంచలనం. హీరో చనిపోయి ఆత్మ ఈగలోకి ప్రవేశించి, హీరోయిన్ ని విలన్ నుంచి ఎలా కాపాడాడు అనేది కథ. అప్పట్లో ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ కి బాగా ఖర్చు చేశారు. అలాంటి సినిమాలు హాలీవుడ్ తప్ప మన వాళ్ళు తియ్యలేరు .. కానీ, ఇప్పుడు రాజమౌళి ఈగ లాంటి సినిమానే మలయాళంలో త్వరలో విడుదల కానుంది.

వెస్ట్రన్ ఘాట్స్ ప్రొడక్షన్స్, నేని ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శరణ్య, అమర్ రామచంద్రన్ నిర్మాణంలో దిలీష్ కరుణాకరన్ దర్శకత్వంలో మ్యాథ్యు థామస్ హీరోగా " లవ్లీ " చిత్రం తెరకెక్కుతుంది. ప్రేమలు, జాబిలమ్మ నీకు అంత కోపమా.. లాంటి డబ్బింగ్ మూవీస్ తో మన తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. అయితే, తాజాగా ఈ లవ్లీ చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది.

టీజర్ లో రాజమౌళి సినిమాలో అబ్బాయి ఎలా చనిపోతాడో ఇక్కడ ఓ అమ్మాయి చనిపోయాక ఈగలా పుట్టి హీరో దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఈగలా వచ్చి హీరో దగ్గరికి ఎందుకు వచ్చిందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలసిందే. టీజర్ అయితే అందర్ని మెప్పించింది. రాజమౌళి మూవీలో ఈగ మాట్లాడదు. కానీ, ఇందులో ఈగ మాట్లాడటం షాకింగ్ గా ఉంది. ఇక, ఈ లవ్లీ చిత్రం ఏప్రిల్ 4న మలయాళంలో థియేటర్స్ లో విడుదల కానుంది.

Click For Video..

Next Story