- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sumaya Reddy:‘డియర్ ఉమ’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందం.. నిర్మాత, రచయితగా చేస్తోన్న హీరోయిన్.. త్రిబుల్ టాలెంటెడ్ నటి ఎవరంటే?
డిఫరెంట్‌గా ఫీల్ గుడ్ ఎమోషనల్ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘డియర్ ఉమ’ (Dear Uma).

దిశ, వెబ్‌డెస్క్: డిఫరెంట్‌గా ఫీల్ గుడ్ ఎమోషనల్ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘డియర్ ఉమ’ (Dear Uma). ఈ మూవీకి సాయి రాజేష్ మహా దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్(Suma Chitra Arts Banner)పై వస్తోన్న ఈ సినిమాలో సప్తగిరి, కమల్ కామరాజు, అజయ్ ఘోష్, రాజీవ్ కనకాల (Rajiv Kanakala), ఆమని, రూపలక్ష్మీ పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హీరో పృథ్వీ సరసన సుమయ రెడ్డి (Sumaya Reddy) కథానాయికగా నటిస్తోంది.
అయితే ప్రేక్షకుల మూవీ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాజాగా చిత్ర యూనిట్ ‘డియర్ ఉమ’ సినిమా విడుదల తేదీని రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఓ మెసేజ్ ఇవ్వబోతున్న డియర్ ఉమ మూవీ ఏప్రిల్ 18 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుందని టీమ్ వెల్లడించింది.
ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటేంటే..? డియర్ ఉమ మూవీలో సుమయ రెడ్డి కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. ఈ చిత్రానికి రచయితగా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. ఈ వార్త విన్న నెటిజన్లు త్రిబుల్ టాలెంటెడ్ హీరోయిన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






