- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhanda-2: బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ-2పై సాలిడ్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకోవడంతో.. ప్రజెంట్ ‘డాకు మహారాజ్’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ‘డాకు మహారాజ్’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ పండుగా చేసుకుంటున్న బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ ఇచ్చారు మూవీ యూనిట్.
నట సింహం బాలకష్ణ (Balakashna)- యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతోంది. అంతే కాకుండా రీసెంట్‌గా ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ (September) 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు X వేదికగా.. ‘అఖండ2 - విశ్వాసం అండ్ భక్తి యొక్క నిజమైన సారాంశాన్ని సంగ్రహిస్తూ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో తాండవం షూటింగ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 25, 2025న దసరాకి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
#Akhanda2 - Thaandavam begins its shoot at the Maha Kumbh Mela in Prayagraj, capturing the true essence of faith and devotion 🔱 pic.twitter.com/2RE5gHwJB0
— Suresh PRO (@SureshPRO_) January 13, 2025






