Prabhas: ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచిన ప్రభాస్ టీం.. అయ్యో ఇంకా ఎప్పుడు..?

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

Prabhas: ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచిన ప్రభాస్ టీం.. అయ్యో ఇంకా ఎప్పుడు..?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ కాగా.. ఈ ఏడాదిలో వివాహం జరగనుందని కొన్ని మీడియా సంస్థలు (Media organizations) కోడై కూస్తున్నాయి. అంతే కాకుండా కృష్టంరాజు (Krishnam Raj) సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Shyamala Devi) ప్రస్తుతం ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లో డార్లింగ్ పెళ్లిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏ క్షణంలోనైనా వీటిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేస్తుందంటూ వెయిట్ చేస్తున్న తరుణంలో.. ప్రభాస్ టీమ్ దీనిపై పెద్ద బాంబ్ పేల్చింది.

ఆ వైరల్ న్యూస్‌(Viral news)పై స్పందిస్తూ.. ‘పలు సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను విజ్ఞప్తి చేస్తున్నాము’ అంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న తన అభిమాన హీరో పెళ్లి ఇప్పుడైనా అవుతుందన్న సంతోషంలో ఉన్న ఫ్యాన్స్ ఆ పోస్ట్‌తో నిరుత్సాహంలో మునిగిపోయారు. కాగా.. ప్రభాస్ సినిమా విషయాలకు వస్తే.. ఈ రెబల్ స్టార్ ప్రస్తుతం సలార్ -౨ (Salar -2), రాజాసాబ్ (Rajasaheb), స్పిరిట్‌(Spirit)తో పాటు మరో రెండు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Next Story