Marco: హీరో లేకుండానే బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ ప్రకటించిన టీమ్.. షాక్‌లో ఫ్యాన్స్

by Chukka Sudharani |

మాలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’.

Marco: హీరో లేకుండానే బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ ప్రకటించిన టీమ్.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మాలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కబీర్ దుహాన్ సింగ్, సిద్దిఖీ, జగదీశ్, యుక్తి తరేజా, అభిమన్ను తివకన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన.. ఈ మూవీ రిలీజ్‌కు ముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. మరీ క్రూరమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయంటూ.. సెన్సార్ కూడా పలు సీన్స్‌కు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి మార్కో మూవీ గత ఏడాది డిసెంబర్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

అంతేకాకుండా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మోస్ట్ వైలెంట్ మూవీగా సంచలనం సృష్టించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్‌గా హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి తాజాగా సీక్వెల్‌కు రిజిస్టర్ చేయించుకున్నారు మేకర్స్. ఈ మేరకు ఓ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అందులో ‘బ్లాక్ బస్టర్ మార్కోకు సీక్వెల్‌గా ‘లార్డ్ మార్కో’ రాబోతున్నది.. ఉన్నిముకుందన్ మార్కో పార్ట్-2 లో భాగం కావడం లేదు.. మరి ఈ అతిపెద్ద మాలీవుడ్ సీక్వెల్‌లో ఏ నటుడు పాల్గొంటారో చూద్దాం’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఉన్ని ముకుందన్ లేకుండా సీక్వెల్‌లా అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. లింక్


Next Story