- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌కి మరో షాక్.. సుప్రీంకోర్టులోనూ జన నాయగన్ కు చుక్కెదురు
సుప్రీంకోర్టులోనూ విజయ్ జననాయగన్ సినిమాకు చుక్కెదురైంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మంద్రాస్ హైకోర్టు ఉత్వర్వులను చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులోనూ విజయ్ జననాయగన్ సినిమాకు చుక్కెదురైంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మంద్రాస్ హైకోర్టు ఉత్వర్వులను చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు సుప్రీం ధర్మాసనం సూచించింది.
ఇదిలా ఉంటే జననాయగన్ సినిమా ఈ సంక్రాంతికి ముందే విడుదలకు సిద్ధం అవ్వగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో విడుదలకు బ్రేక్ పడింది. సినిమాలో రాజకీయ, సామాజిక, కులపరమైన కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఆడియోలను మ్యూట్ చేయాలని చిత్రయూనిట్ కు సెన్సార్ బోర్డు సూచించింది. దీంతో చిత్రయూనిట్ కోర్టును ఆశ్రయించగా అక్కడ సైతం అనుకూలంగా తీర్పు రాలేదు. తరవాత సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నాారు. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.






