హ్యాపీ బర్త్‌డే NSG అంటూ భార్యకి విష్ చేసిన సూపర్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Gugulothu.Kavitha |

కూల్ అండ్ క్యూటెస్ట్ కపుల్ అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)- నమ్రతా శిరోద్కర్(Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హ్యాపీ బర్త్‌డే NSG అంటూ భార్యకి విష్ చేసిన సూపర్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: కూల్ అండ్ క్యూటెస్ట్ కపుల్ అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)- నమ్రతా శిరోద్కర్(Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో జంటగా నటించిన వీరు.. పెళ్లి చేసుకుని రియల్ పెయిర్ అయిపోయారు. ఇక మ్యారేజ్ తర్వాత నమ్రతా పూర్తిగా సినిమాలకు దూరం అయింది. కానీ మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)తో కలిసి ‘SSMB-29’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు భార్య నమ్రతాది ఈ రోజు పుట్టిన రోజు. దీంతో ఆమెకు స్పెషల్ విష్ చేస్తూ మహేష్.. తన ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేశాడు. అంతేకాకుండా అదిరిపోయే క్యాప్షన్ కూడా జోడించాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, NSG.. ప్రతి రోజు ప్రకాశవంతంగా అండ్ మెరుగ్గా చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజు అండ్ ఎల్లప్పుడూ ఈ పుట్టినరోజును ఎంతో అద్భుతంగా జరుపుకోవాలపుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. హ్యాపీ బర్త్‌డే వదినమ్మ అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story