కూలీ సినిమా కోసం ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సూపర్ స్టార్.. ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..

by I. Sairam |   (  Updated:2025-05-08 02:30:29  IST  )

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie).

కూలీ సినిమా కోసం ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సూపర్ స్టార్.. ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie). నాగార్జున(Nagarjuna) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్(Sruthi Haasan), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్(Anirudh) సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ క్రమంలో రజినీకాంత్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ రూ.260-280 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు పింక్‌విల్ల(Pinkvilla) పేర్కొంది. దాదాపు రూ.400+ కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో కీరోల్ ప్లే చేస్తున్న నాగార్జున సైతం రూ.24కోట్లు తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఈ చిత్రంతో రజినీ ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా నిలిచారని వెల్లడించింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story