ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన మూవీ ‘ఛావా’.

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన మూవీ ‘ఛావా’. లక్షణ్ రామచంద్ర ఉటేకర్(Lakshan Ramachandra Utekar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఇందులో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటి, వినీత్ కుమార్ సింగ్(Vineet Kumar Singh) కీలక పాత్రలో కనిపించారు. ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతి శంభాజీ మహరాజ్ యుద్ధాలు, ఆయన పరిపాలన, మొగల్ చక్రవర్తి ఔరంగ జేబుతో వైరం, శంభాజీ త్యాగాలే ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా ‘ఛావా’.

ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాషీసు వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో అంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయినట్లు ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story