- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెకాయిట్ మూవీలో ఆ స్టార్ విలన్.. నెట్టింట హైప్ పెంచుతున్న పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ‘క్షణం’(KSHANAM) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘హిట్-1’(HIT-1), ‘హిట్-2’(HIT-2), ‘గూఢాచారి’(GUDACHARI), ‘మేజర్’(MEJOR) వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ‘క్షణం’(KSHANAM) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘హిట్-1’(HIT-1), ‘హిట్-2’(HIT-2), ‘గూఢాచారి’(GUDACHARI), ‘మేజర్’(MEJOR) వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలకు సైన్ చేసి స్టార్ డమ్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(DACOIT). లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda), సునీల్ నారంగ్(Suneel Narang) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో మరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాలో స్టార్ విలన్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ఇన్‌స్పెక్టర్ స్వామి(Swamy) పాత్రలో కనిపించనున్నట్లు ఆయన ఫస్ట్ లుక్(First Look) రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ గమనించినట్లయితే.. సీరియస్ లుక్‌లో అనురాగ్ కశ్యప్ ఎవరినో చూస్తున్నాడు. బ్లాక్ షర్ట్ వేసుకుని గుబురు గడ్డం, నుదుటన బొట్టు, మెడలో రుద్రాక్ష మాలతో కనిపించాడు. ప్రస్తుతం ఆయన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.






