దర్శక రంగంలోకి అడుగుపెట్టనున్న ఆ స్టార్ హీరో కూతురు.. ఏకంగా ఆ హిట్ హీరో సినిమాకు..

by I. Sairam |   (  Updated:2025-04-10 11:11:06  IST  )

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు, ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా అవసరం.

దర్శక రంగంలోకి అడుగుపెట్టనున్న ఆ స్టార్ హీరో కూతురు.. ఏకంగా ఆ హిట్ హీరో సినిమాకు..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు, ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా అవసరం. ప్రత్యేకించి స్టార్ వారసులు తమ సొంత టాలెంట్‌ను రూపొందించుకోవాలంటే ముందుగా క్రాఫ్ట్ పై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే చాలా మంది నటీనటుల వారసులు యాక్టర్స్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. నిర్మాణ, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కూతురు మోక్షద(Mokshada) ఇప్పుడు తన సినీ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఆమె నటనకు బదులుగా నిర్మాణ రంగంలోకి (Production Department)పై ఆసక్తి చూపుతూ, ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పని చేస్తుంది. ఇక ఈ చిత్రానికి వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మోక్షద ఈ దిశగా వేస్తున్న అడుగులు పరిశ్రమలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో, కొత్త తరానికి చెందిన వారసులు నిర్మాణ రంగంలో పని చేస్తూ తమకు అవసరమైన అనుభవాన్ని సంపాదించుకుంటున్నారు. ఇదే తరహాలో మోక్షద కూడా పని చేస్తుండటంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నటనలో కాకుండా, తెర వెనుక ఉండే ప్రొడ్యూసర్‌గా ఎదగాలనే ఆమె ఆలోచన చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎలా రాణిస్తుందో.

Next Story