- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అఖండ-2’లో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ కూతురు.. ఈమె అందం ముందు హీరోయిన్స్ కూడా తక్కువే
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ(Laya) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ(Laya) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసింది. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలోనే సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి నితిన్(Nithin) నటించిన ‘రాబిన్ హుడ్’(Robin Hood) చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్‌ను వివాహం చేసుకున్న లయ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. అయితే కూతురు శ్లోకా ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఆమె ఇలియానా చిన్నప్పటి పాత్రలో కనిపించింది. అయితే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బోయపాటి శ్రీను(Boyapati Srinu) డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ అయినటువంటి ‘అఖండ-2’(Akhanda-2)లో ఈ చిన్నారి నటించే చాన్స్ కొట్టేసిందట. అఖండలో ఒక చిన్న పాప క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాత్రను సీక్వెల్‌లో కంటిన్యూ చేయడం కోసం శ్లోకాను ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఈ చిత్రం శ్లోకాకు హిట్ తెచ్చిపెట్టి లయ కూతురిగా ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా చేస్తుందేమో చూడాలి.






