- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింక్ డ్రెస్‌లో అలనాటి స్టార్ హీరోయిన్.. చైల్డ్ హుడ్ క్రష్ అంటూ కామెంట్స్
అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న’(Mallanna) సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది. కానీ తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన రెట్రో మూవీలో ఐటెం సాంగ్‌లో చిందులేసింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్‌తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో పింక్ కలర్ డ్రెస్‌లో థైస్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. చాలా సన్నగా ఉండి తన నడుము అందాలతో వావ్ అనిపించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు చైల్డ్ హుడ్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






