- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన ‘మెగా-157’(Mega-157) మూవీలో నటిస్తోంది. ఇక దీనికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ‘అమ్మోరు-2’(Ammoru-2) చిత్రంలో కూడా యాక్ట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. నయనతార కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్(Vignesh Shivan)తో ప్రేమలో పడి గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. ఇక సరోగసీ ద్వారా ఈ జంట ఇద్దరు బాబులకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక అప్పటినుంచి భర్త పిల్లలతో ఈ ముద్దుగుమ్మ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నయన్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తన భర్త, పిల్లలతో(ట్విన్స్) ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నయన్ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






