- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తున్న స్టార్ హీరో.. ప్రమాదకరంగా ఉండటమే బ్రతకడానికి ఏకైక మార్గమంటూ హైప్ పెంచుతున్న పోస్టర్..
కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో ధనుష్(Dhanush) హీరోగా నటించిన “కుబేర”(Kubera) చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో ధనుష్(Dhanush) హీరోగా నటించిన “కుబేర”(Kubera) చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మరోపక్క డైరెక్టర్‌గా కూడా మారి మంచి సినిమాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఈ హీరో. ధనుష్ కెరీర్‌లో 54వ(D-54) సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక దీనికి దర్శకుడు విగ్నేష్ రాజా(Vignesh Raja) దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే థింక్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తుండగా.. జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ..‘కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉండటమే బ్రతకడానికి ఏకైక మార్గం. #D54లో ధనుష్ ఈరోజు నుండి షూటింగ్‌లో పాల్గొంటాడు’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ధనుష్ నిలబడి దిగాలుగా కనిపిస్తుండగా తన పత్తి పంట కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ధనుష్ ఒక రైతుగా కనిపిస్తాడని అనిపిస్తుంది. మొత్తానికి ధనుష్ మాత్రం మరో సాలిడ్ రూరల్ ఎమోషనల్ డ్రామాతో రాబోతున్నాడని పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది. Link






