- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నప్ప సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ బ్యూటీ చెల్లి.. బూరెల బుట్టను కాలితో తన్నేసావుగా అంటూ కామెంట్స్
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ‘కన్నప్ప’(Kannappa) మూవీ జూన్ 27న రిలీజ్ అయి మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ‘కన్నప్ప’(Kannappa) మూవీ జూన్ 27న రిలీజ్ అయి మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohan Lal), కాజల్(Kajal)తో పాటు మిగిలిన యాక్టర్స్ కూడా తన నటనతో మెప్పించారు. రెండు రోజుల్లోనే ఈ సినిమాకు 45 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా నటించిన యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్(Preethi Mukundan) కూడా తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ‘నెమలి’ అనే రాకుమార్తె పాత్రలో కట్టిపడేసింది. ఇది ప్రీతికి రెండో తెలుగు సినిమా. గతంలో శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
కాగా కన్నప్ప సినిమాలో మొదటగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Krithi Sanan) చెల్లి నపూర్ సనన్(Napur Sanan)ని అనుకున్నారట. ఇందులో భాగంగా ఆమెతోనే పూజా కార్యక్రమాలు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఉన్నట్టుండి కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్‌కి దక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. బూరెల బుట్టను కాలితో తన్నేశావుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link






