‘కిష్కిందపురి’ నుంచి ఉండిపోవే నాతోనే సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-08 04:52:35  IST  )

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) రీసెంట్‌గా ‘భైరవం’(Bhairavam) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

‘కిష్కిందపురి’ నుంచి ఉండిపోవే నాతోనే సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) రీసెంట్‌గా ‘భైరవం’(Bhairavam) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘కిష్కింధ పురి’(Kiskindhapuri). ఇక హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ డైరెక్టర్ కౌషిక్ పెగళ్లపాటి(Koushik Pegallapathi) దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్, అర్చన ప్రెజెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్‌డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’(Undipove Nathone) అనే సాంగ్ రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)సంగీతం సమకూర్చిన ఈ పాటకు పూర్ణ చారి సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. స‌ముద్రం ఒడ్డున అంద‌మైన లోకేష‌న్ల‌లో చిత్రీక‌రించిన పాగ మంచి మెలోడియ‌స్‌గా సాగుతూప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడాఈ సాంగ్‌ను వినేయండి.

Next Story