పరిస్థితి ఏం బాలేదు.. చాలా భయమేస్తుందంటూ టాలీవుడ్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina) చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పరిస్థితి ఏం బాలేదు.. చాలా భయమేస్తుందంటూ టాలీవుడ్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina) చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో హిట్ అందుకున్న ఆయన 2018 తర్వాత రెండేళ్లు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక నేను లోకల్, ధమాకా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి బాక్సాఫీసును షేక్ చేశారు. తర్వాత అవకాశాలు లేకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇక ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’(Mazaka). సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా నటించిన ఈ చిత్రంలో అన్షు అంబానీ, రితు వర్మ(Rithu Verma) హీరోయిన్లుగా నటించారు. అయితే ఫిబ్రవరి 21న విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘శౌర్యపాఠం’ ఈవెంట్‌కు హాజరై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను ఈ మధ్య కాలంలో థియేటర్స్ చూస్తున్నాను. అసలు జనాలు సినిమాలు చూడటానికి రావడం లేదు. షూటింగ్స్ అని ఆంధ్రప్రదేశ్‌లో బాగా తిరుగుతున్నాను అయితే ఏ స్టార్ నటించిన మూవీ అయినప్పటికీ ప్రేక్షకులు రావడం లేదు. సెకండ్ షోలు కూడా అందుకే వేయడం లేదు. వాటిని మొత్తానికే తీసేశారు ఏం లేవు కేవలం ఫస్ట్ షో మాత్రమే వేస్తున్నారు. సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్టార్స్ నటించిన మూవీనే చూడటం లేదు.. ఇంత మంది కొత్తవాళ్లని పెట్టి చేసిన చిత్రాన్ని విడుదల చేయాలంటే భయమేస్తుంది. అసలు సినిమాల పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story