అనంత పద్మనాథుడి చుట్టు ‘జటాధర’ బంధం.. పూజతో స్టార్ట్ (ఫొటోలు వైరల్ )

by Chukka Sudharani |

నవ దళపతి సుధీర్ బాబు (Sudhir Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’(Jatadhara).

అనంత పద్మనాథుడి చుట్టు ‘జటాధర’ బంధం.. పూజతో స్టార్ట్ (ఫొటోలు వైరల్ )
X

దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు (Sudhir Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’(Jatadhara). ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ (Natural mythological thriller Movie)చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), మైత్రీ నిర్మాత రవిశంకర్ (Ravi Shankar), దర్శకుడు వెంకీ అట్లూరి(Venkye Atloori), దర్శకుడు మోహన ఇంద్రగంటి(MOhana Indraganti), శిల్పా శిరోధ్కర్ (Shilpa Shirodkar)ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

పూజా కార్యక్రమం అనంతరం జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో రూపొందుతోన్న జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే సినిమా ఇది. ‘జటాధర’ కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో సుధీర్ బాబు క్యారెక్టర్‌ చాలా భిన్నంగా ఉండబోతోంది. యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story