గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్.. అవాక్కవుతున్న ఫ్యాన్స్..

by Gugulothu.Kavitha |

అలనాటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్(Radhika Sharath Kumar) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్.. అవాక్కవుతున్న ఫ్యాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్(Radhika Sharath Kumar) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi)తో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. వీరిద్దరి సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ ఉండేది. ఈ జంట కలిసి నటించిన సినిమా అంటే పక్కా హిట్టే అన్నట్లుగా ఉండేది. అలా తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమా ‘తాయ్ కిజవి’. ఈ మూవీకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాతోనే అతను దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయగా.. రాధిక శరత్ కుమార్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. 75 ఏళ్ల బామ్మగా ఉన్న రాధిక లుక్‌ చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. కాగా ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు, తదితర అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు ఇదివరకే చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story