కలర్‌ఫుల్‌గా "శశిరేఖ".. మన శంకర వరప్రసాద్ గారు సెకండ్ సింగిల్ అదుర్స్

by Ajay Maddhiboyina |

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న లేటెస్ట్ చిత్రం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు. ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు తెరకెక్కుతోంది.

కలర్‌ఫుల్‌గా శశిరేఖ.. మన శంకర వరప్రసాద్ గారు సెకండ్ సింగిల్ అదుర్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న లేటెస్ట్ చిత్రం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు. ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు తెరకెక్కుతోంది. చిత్రంలో నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన మీసాల పిల్ల పాట యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రేక్షకులు చిరు అభిమానులు ఫిదా అయ్యారు.

కాగా ఈ సినిమా నుండి మరో పాట ప్రోమోను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. శశిరేఖ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేయగా ఈ ప్రోమో కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. శ‌శిరేఖా ఓ మాట చెప్పాలి.. చెప్పాక ఫీలు కాక‌.. అంటూ ఈ పాట లిరిక్స్ సాగుతోంది. అంతే కాకుండా ఎంతో క‌ల‌ర్ ఫుల్ గా ఈ పాట‌ను చిత్రీక‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. పాట‌లో చిరంజీవి న‌య‌న‌తార బోటులో ప్ర‌యాణిస్తూ చాలా అందంగా క‌నిపిస్తున్నారు. ఈ మొత్తం పాట‌ను ఈనెల 8వ తేదీన చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. VIDEO

Next Story