- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి‘ నుంచి సెకెండ్ సింగిల్ రాబోతుందోచ్.. రొమాంటిక్ మూడ్‌లో హీరో హీరోయిన్(పోస్ట్)
మాస్ మహారాజ రవితేజ(Ravi Teja), కిశోర్ తిరుమల(Kishore Thirumala) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahashayulaku Vignapthi).

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ(Ravi Teja), కిశోర్ తిరుమల(Kishore Thirumala) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahashayulaku Vignapthi). ఈ మూవీలో యంగ్ బ్యూటీస్ ఆషికా రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయతి(Dimple Hayathi)లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో 76వ చిత్రంగా తెరకెక్కనుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ Bella Bella సాంగ్ విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భార్యా భర్తలందరూ తమ లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక పాట ఉంది అని సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు’ అప్‌డేట్ అందించారు మూవీ టీమ్.
రవితేజ, డింపుల్ హయతి కాంబోలో రానున్న ఈ సాంగ్ ప్రోమో ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు లాంచ్ చేయనున్నట్టు.. అలాగే ఫుల్ సాంగ్ మాత్రం డిసెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే ట్రెడిషనల్ వేర్‌లో రవితేజ, డింపుల్ హయతి సూపర్ కూల్ లుక్‌లో కనిపించారు. రవితేజను హయాతీ పట్టుకొని అతని వైపు రొమాంటిక్‌గా చూస్తున్న లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.






