రౌడీ హీరో చేసిన పనికి నెట్టింట ప్రశంసల జల్లు.. బంగారంరా మా అన్న అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-28 07:44:00  IST  )

కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) డైరెక్షన్‌లో సూర్య(Surya), పూజా హెగ్డే(Pooja Hegde) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘రెట్రో’(Retro).

రౌడీ హీరో చేసిన పనికి నెట్టింట ప్రశంసల జల్లు.. బంగారంరా మా అన్న అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) డైరెక్షన్‌లో సూర్య(Surya), పూజా హెగ్డే(Pooja Hegde) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘రెట్రో’(Retro). ఈ తమిళ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ(Suryadevara Naga Vamsi) రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ను స్పీడ్ చేశారు మూవీ టీమ్. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌(Hyderabad)లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ రౌడీ హీరో చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

రెట్రో ఈవెంట్‌కు వచ్చిన విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్స్ విజయ్‌తో ఫొటో తీసుకోవాలని ఆశపడ్డారు. దీంతో అతని దగ్గరకి ఫొటో తీసుకోవాలని చాలా మంది గర్ల్స్ వెళ్లారు. అయితే అక్కడ సోఫాలో నార్మల్‌గా కూర్చున్న విజయ్.. తన కాళ్లు వాళ్లకి ఎక్కడ తగులుతుందో అని భావించి కాళ్లను పైకి అని కూర్చున్నాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గోల్డ్‌ రా మా అన్న.. కాళ్లు ఎక్కడ తగులుతుందో అని ముందే పైకి పెట్టి కూర్చున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story