- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రముఖ సంస్థ చేతికి పెద్ది నైజాం హక్కులు
పెద్ది సినిమా నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న తెలుగు చిత్రాల్లో పెద్ది మొదటి వరుసలో నిలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ మూవీని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణను మినహాయిస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని ఈ సినిమా హీరో రామ్ చరణ్ స్వయంగా చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మరోవైపు ఈ సినిమా బిజినెస్ ను కూడా క్లోజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క నైజాం హక్కులను అమ్మినట్లు, వాటిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నైజాంలో ఈ సంస్థకు మంచి పట్టు ఉండడంతో ఇక్కడ ఈ సినిమా పెద్ద స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






