‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ నుంచి ‘నువ్వే కాదా’ సాంగ్ రిలీజ్ టైమ్ ఫిక్స్

by Pulgam srinivas |

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాలోని “నువ్వే కాదా” లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్ 1న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ నుంచి ‘నువ్వే కాదా’ సాంగ్ రిలీజ్ టైమ్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రాశి సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మూవీ బృందం మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రంలోని “నువ్వే కాదా” అనే లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్ 1న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ప్రముఖ ఎఫ్‌ఎం ఛానల్ రెడ్ ఎఫ్‌ఎం 93.5 వేదికగా ఈ పాటను లాంచ్ చేయనున్నారు.

దీంతో ఈ సాంగ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో హీరో వడ్డే నవీన్, హీరోయిన్ రాశి సింగ్ మధ్య కనిపిస్తున్న రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను బట్టి సినిమాలో వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే “నువ్వే కాదా” పాట మెలోడియస్‌గా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కమల్ తేజ నార్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వడ్డే నవీన్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.




Next Story