- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కరుప్పు'కి రిలీజ్ కష్టాలు.. భావోద్వేగానికి గురైన ఆర్జే బాలాజీ
ఈరోజు విడుదల కావాల్సిన ‘కరుప్పు’ చిత్రానికి సంబంధించిన షోలు క్యాన్సిల్ కావడంతో ఎమోషనల్ అయిన దర్శకుడు ఆర్‌జే బాలాజీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో విడుదల చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు సినిమాలో సూర్య హీరోగా, త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను ఈరోజు, మే 14న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అన్నీ సిద్ధమయ్యాయని భావించిన సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో షోలు రద్దయ్యాయి. దీంతో సూర్య అభిమానులు మూవీ మేకర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో షోలు క్యాన్సల్ కావడంతో దర్శకుడు ఆర్‌జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన భావోద్వేగానికి గురవుతూ.. “క్షమించండి.. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు.
ఈ సినిమాను కచ్చితంగా ఈరోజే ఉదయమే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అతి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. సూర్య అభిమానులు నన్ను క్షమించాలి” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా అన్ని సమస్యలను అధిగమించి ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






