- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీన రీ రిలీజ్‌కు రెడీ అయిన కల్ట్ క్లాసిక్ ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’
'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' చిత్రాన్ని 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిమ్రాన్, సమీరా రెడ్డి, దివ్య స్పందన హీరోయిన్లుగా నటించారు. హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వేణు రవిచంద్రన్ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో మూడు సార్లు రీ రిలీజ్ చేయగా ప్రతిసారి కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈసారి ఈ కల్ట్ క్లాసిక్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.






