హాట్ టాపిక్‌గా మారిన ‘వృషకర్మ’ రిలీజ్ డేట్.. స్టార్ హీరోతో క్లాష్ తప్పదా?

by Pulgam srinivas |

‘వృషకర్మ’ చిత్రాన్ని దసరా బరిలో విడుదల చేయాలనే మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

హాట్ టాపిక్‌గా మారిన ‘వృషకర్మ’ రిలీజ్ డేట్.. స్టార్ హీరోతో క్లాష్ తప్పదా?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే రాజస్థాన్‌లో ఒక భారీ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. చిత్రబృందం ‘వృషకర్మ’ను దసరా బరిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అన్ని అనుకూలిస్తే త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా దసరా బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ‘వృషకర్మ’కు బాలకృష్ణ సినిమాతో బాక్సాఫీస్ పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలు దసరా పండుగకు విడుదల అవుతాయా లేదా వేరే తేదీల్లో వస్తాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘వృషకర్మ’పై తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story