- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాని ‘కోర్టు’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేమలో రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్ట్ వైరల్
నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody).

దిశ, సినిమా: నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
కాగా ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్(First Single) అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. కోర్టు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ప్రేమలో’(Premalo) లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పాట ఆడియో రైట్స్‌ను సరిగమ సౌత్(Sarigama South) సొంతం చేసుకున్నట్లు తెలిపింది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ఉండగా వచ్చే లవ్ సాంగ్ అన్నట్లు తెలుస్తోంది.
హీరో.. హీరోయిన్ చేతిలో చేయి పెట్టి ప్రేమగా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ప్రియదర్శి ‘మల్లేశం’(Mallesham), ‘బలగం’(Balagam), ‘జాతి రత్నాలు’(Jathi Ratnalu), ‘డార్లింగ్’(Darling), ‘35 చిన్న కథ కాదు’(35 Chinna Katha Kadu) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన కామెడీ టైమింగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.






